Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతా ;సర్పంచ్ సుజాత రాజశేఖర్ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 24, 2026 11:31 PM

నీట్ అక్రమాలపై నల్లగొండలో విద్యార్థి సంఘాల ఆగ్రహం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ అక్రమాలపై నల్లగొండలో విద్యార్థి సంఘాల ఆగ్రహం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ అక్రమాలపై నల్లగొండలో విద్యార్థి సంఘాల ఆగ్రహం.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
July 24, 2026 08:56 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో విద్యార్థి, యువజన సంఘాలు ఉమ్మడిగా ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించి, అనంతరం క్లాక్‌టవర్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్, ఇందూరు సాగర్, ముదిగొండ మురళీకృష్ణ, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. విద్యార్థుల ప్రాణాలకు, భవిష్యత్తుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీచార్జీలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నీట్ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం విస్మరిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ఆందోళనలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాను, జిల్లా కార్యదర్శి పవన్‌తో పాటు వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News