Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:15 PM

విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేతలు

25-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, జూలై 24: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం యాకుత్‌పురా నియోజకవర్గంలోని సరస్వతి నగర్ డివిజన్‌లో శుక్రవారం సైలెంట్ ప్రొటెస్ట్ నిర్వహించారు. సిటీకేఫ్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనకు డివిజన్ అధ్యక్షురాలు నేనావత్ దేవి నాయకత్వం వహించారు. కార్యక్రమానికి యాకుత్‌పురా కాంగ్రెస్ ఇన్‌చార్జి కె. రవిరాజు, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగినట్లు పేర్కొంటున్న దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే కేంద్ర ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం వ్యతిరేకంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.

Sthanikam

విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News