Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:11 PM

ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్‌పీహెచ్‌ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్.

25-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో లక్ష్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) పునఃప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే సూచనల మేరకు లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)ను కలిసి పాఠశాల సమస్యలను వివరించగా, పాఠశాల పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

విద్యార్థుల నమోదు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తామని డీఈఓ హామీ ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కొత్తగూడెం సర్పంచ్ బద్దం యాదమ్మ–యాదగిరి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం వార్డు సభ్యుడు జవ్వాజీ కిషోర్ తన కుమారుడిని ఆరో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని చాటారు.

గ్రామాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నమోదు సంఖ్యను పెంచాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ బడిని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ ప్రజాప్రతినిధులు ప్రకటించారు.

Sthanikam

ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్‌పీహెచ్‌ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్.

Article Image

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో లక్ష్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) పునఃప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే సూచనల మేరకు లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)ను కలిసి పాఠశాల సమస్యలను వివరించగా, పాఠశాల పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

విద్యార్థుల నమోదు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తామని డీఈఓ హామీ ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కొత్తగూడెం సర్పంచ్ బద్దం యాదమ్మ–యాదగిరి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం వార్డు సభ్యుడు జవ్వాజీ కిషోర్ తన కుమారుడిని ఆరో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని చాటారు.

గ్రామాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నమోదు సంఖ్యను పెంచాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ బడిని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ ప్రజాప్రతినిధులు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News