Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:28 PM

బోరంచకు ఆరోగ్య వరం.. నూతన పీహెచ్‌సీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

24-07-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.59 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. పీహెచ్‌సీ నిర్మాణం పూర్తయితే బోరంచతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు గ్రామంలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు,అభిమానులు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

బోరంచకు ఆరోగ్య వరం.. నూతన పీహెచ్‌సీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.59 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. పీహెచ్‌సీ నిర్మాణం పూర్తయితే బోరంచతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు గ్రామంలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు,అభిమానులు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News