Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి:జడ్జి ఎం. హిమబిందు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 25, 2026 06:46 PM

50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలి. జీవో అమలు చేయాలి.ఎర్ర రమేష్ గౌడ్

50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలి. జీవో అమలు చేయాలి.ఎర్ర రమేష్ గౌడ్

50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలి.  జీవో అమలు చేయాలి.ఎర్ర రమేష్ గౌడ్
July 25, 2026 04:04 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

రామన్నపేట, జూలై 25

50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని గీత పనివారల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికులు 20 ఏళ్ల వయసు నుంచే తాళ్లెక్కుతూ ప్రాణాలను పణంగా పెట్టి జీవనం సాగిస్తారని, 50 ఏళ్లు వచ్చేసరికి శారీరకంగా బలహీనపడటంతో ఇతర పనులు చేసే పరిస్థితి కూడా ఉండదని ఆయన అన్నారు.

గీత కార్మికుల కష్టాలను గుర్తించి గతంలో 50 ఏళ్లకే పింఛన్ కల్పించే నిర్ణయం తీసుకున్నారని, ఆ జీవో స్ఫూర్తిని నిలబెట్టి అర్హులైన గీత కార్మికులకు ఆలస్యం చేయకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.

అదేవిధంగా జీవో నెం.560 ప్రకారం గీత కార్మికులకు తాటి, ఈత చెట్ల వనాల పెంపకం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో గీత వృత్తికి భరోసా కల్పించడంతో పాటు కార్మికుల జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గీత పనివారల సంఘం సభ్యత్వ నమోదుకార్యక్రమాన్నినిర్వహించారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, సొసైటీ అధ్యక్షుడు ఎర్ర వెంకటేశం, లగ్గోని యాదయ్య, బాలగోని మల్లయ్య, కూనూరు కృష్ణ, బాలగోని నరసింహ, భూపతి నరసింహ, గోపగోని సహదేవ్, బాలగోని శంకర్, కూనూరు నరసింహ, చెరుకు శివరాజ్, గుణగంటి కన్నయ్య, ఆకిటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News