Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:27 PM

బీఎల్‌వోలపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన – క్షమాపణ చెప్పాలనిCITU అనుబంధ సంఘం డిమాండ్

24-07-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

బీఎల్‌వోలపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన – క్షమాపణ చెప్పాలని సీఐటీయూ అనుబంధ సంఘం డిమాండ్

బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ అవుట రవీందర్ మాట్లాడుతూ, బీఎల్‌వోలు విధులు నిర్వహించడం లేదని, కూర్చున్నా, నిద్రపోయినా వేతనాలు ఖాతాల్లో పడుతున్నాయని ముఖ్యమంత్రి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఓటర్ల జాబితా ప్రక్షాళన వంటి కార్యక్రమాల్లో వారి పాత్రను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

బీఎల్‌ఏలకు ప్రోత్సాహకరంగా మాట్లాడడం తప్పు కాదని, అయితే అందుకోసం బీఎల్‌వోలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తగదని వారు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో బీఎల్‌వోల సేవలను ప్రశంసించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అంగన్‌వాడీ, ఆశా, ఆర్‌పీ, వీవోఏ వంటి సిబ్బంది గౌరవ వేతనాలతో పనిచేస్తూనే అదనపు పారితోషికం లేకుండా బీఎల్‌వో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని నాయకులు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఎలాంటి కష్టపడకుండా వేతనాలు పొందుతున్నారని చెప్పడం తగదని విమర్శించారు.

ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బీఎల్‌వోలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి. సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్కే. సునంద, పాదూరి లక్ష్మి, మణిరూప, యాదమ్మ, జి. కృపావతి, కే. సరోజ, రేణుక, అరుంధతి, అనిత, పల్లవి, విజయకుమారి, జి. పద్మతదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీఎల్‌వోలపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన – క్షమాపణ చెప్పాలనిCITU అనుబంధ సంఘం డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News