Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:20 PM

స్థానిక డిగ్రీ కళాశాలలో ఘనంగా మహాకవి జయంతి వేడుకలు. దాశరథి సాహిత్యం నేటికీ సమాజానికి దిక్సూచి.

25-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 25

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో ప్రజల్లో నింపిన మహాకవి దాశరథి జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో "దాశరథి సాహిత్యం–సందేశం" అంశంపై విస్తృత ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆర్. రత్నమంజుల అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన మహాకవిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ మహమ్మద్ హసేన్ మాట్లాడుతూ.. దాశరథి తన జీవితాన్ని తెలంగాణ సమాజ శ్రేయస్సుకు అంకితం చేసిన మహనీయుడని అన్నారు. కవిత్వంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపడమే కాకుండా, స్వయంగా తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన పోరాట యోధుడని కొనియాడారు.

కళాశాల తెలుగు శాఖాధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకుని అణగారిన, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజాకవి దాశరథి అని అన్నారు. ఆయన సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తినిస్తోందని, ప్రతి విద్యార్థి దాశరథి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు అద్దంకి ఆంజనేయులు, డాక్టర్ జి. సునీత, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, జె. నరేశ్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్థానిక డిగ్రీ కళాశాలలో ఘనంగా మహాకవి జయంతి వేడుకలు. దాశరథి సాహిత్యం నేటికీ సమాజానికి దిక్సూచి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News