Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:08 PM

చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి:జడ్జి ఎం. హిమబిందు

25-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల–పాఠశాల, అలాగే పొట్టిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థులు తమ హక్కులతో పాటు విధుల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రత, విద్యార్థుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం పొందే మార్గాలపై సులభంగా వివరించారు. చట్టాలపై అవగాహన ఉండటం వల్ల నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవరుచుకుని మంచి పౌరులుగా ఎదగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, సిర్గాపూర్ ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి:జడ్జి ఎం. హిమబిందు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News