Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:14 PM

గెజిటెడ్ అధ్యాపకుల సంఘం జిల్లా కార్యదర్శిగా డాక్టర్ డి. కిషన్

25-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

డాక్టర్ కిషన్ గతంలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం విశేషం. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసినందుకే సభ్యులు మరోసారి ఆయనపై విశ్వాసం ఉంచినట్లు సహచరులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం డాక్టర్ కిషన్‌ను అభినందించారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో ఇదే నిబద్ధతతో పనిచేయడంతో పాటు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

గెజిటెడ్ అధ్యాపకుల సంఘం జిల్లా కార్యదర్శిగా డాక్టర్ డి. కిషన్

Article Image

రామన్నపేట, జూలై 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

డాక్టర్ కిషన్ గతంలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం విశేషం. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసినందుకే సభ్యులు మరోసారి ఆయనపై విశ్వాసం ఉంచినట్లు సహచరులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం డాక్టర్ కిషన్‌ను అభినందించారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో ఇదే నిబద్ధతతో పనిచేయడంతో పాటు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News