గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
K.RAVI
మండలంలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిసరాల్లో మొక్కలు నాటి, ఐటీ హబ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. నాడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తే, కేటీఆర్ ఐటీ రంగాన్ని రాష్ట్ర నలుమూలలకూ విస్తరించి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. మునుగోడు లాంటి ప్రాంతానికి ఐటీ పార్కును తీసుకొచ్చి స్థానిక యువత జీవితాల్లో వెలుగులు నింపిన సమర్థుడైన నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మల్కాపురం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్, నల్పరాజు రమేష్, రమణ గోని రఘు, కృష్ణ, ఏర్పుల రాజేష్, సుర్వి లింగస్వామి గౌడ్, శేఖర్ గౌడ్, యాదగిరి, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి