కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి: కార్మిక సంఘం పిలుపు.
కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి: కార్మిక సంఘం పిలుపు.
Editor Desk
రామన్నపేట,
కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలకు కార్మికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి జీవనోపాధికి భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న "చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.
కల్లుగీత కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాస్ గౌడ్, ఉండ్రు రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, గారె రాందాస్ గౌడ్, సంగిశెట్టి చంద్రయ్య, చాకలి గౌడ్, గోపు మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి