Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:41 PM

డీజీపీ కార్యాలయంలో విషాదం.. స్వగ్రామానికి చేరిన స్వామి మృతదేహం

24-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెలిమినేడులో శోకసంద్రం.. క్యాండిల్ ర్యాలీతో ఘన నివాళి.. నేడు అంత్యక్రియలు.

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన స్వామి డీజీపీ కార్యాలయంలో గురువారం సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం స్వామి మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో స్వగ్రామమైన వెలిమినేడుకు తీసుకువచ్చారు.మృతదేహం గ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు.

గ్రామమంతా శోకసంద్రంగా మారగా, స్వామికి నివాళులర్పించేందుకు వందలాది మంది గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని నిశ్శబ్దంగా సాగిన ర్యాలీ హృదయ విదారక వాతావరణాన్ని సృష్టించింది.స్వామి అంత్యక్రియలు శుక్రవారం వెలిమినేడు గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Sthanikam

డీజీపీ కార్యాలయంలో విషాదం.. స్వగ్రామానికి చేరిన స్వామి మృతదేహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News