Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:42 PM

వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు మార్చుకోవాలి: వ్యవసాయ శాఖ

24-07-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కె) గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి హన్మండ్లు రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన వ్యవసాయ చర్యలపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో మండలంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నందున వరికి బదులుగా జొన్న, సజ్జ, పెసర, మినుము వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు వర్షాలు కురిసే వరకు నేరుగా ఎరువులు వేయకుండా, 19-19-19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూ డ్రిప్ సాగు ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. డ్రిప్ పద్ధతికి ప్రభుత్వ సబ్సిడీ అందుబాటులో ఉందని, బోరు బావులు కలిగిన రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. సన్నరకాల వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ వరి రకాలను డీలర్ల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివాజీ పాటిల్, రైతులు అశోక్, శ్రీకాంత్, అశోక్ స్వామి, నాగ్గొండ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు మార్చుకోవాలి: వ్యవసాయ శాఖ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News