Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:41 PM

నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

24-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పట్టణం లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 40వ వార్డు పెన్షనర్స్ భవన్‌లో ఏర్పాటు చేసిన బూత్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్నతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోల పనితీరు, ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ తదితర అంశాలను సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, 40వ వార్డు కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బషీర్, సాయిరాం, పోతు నవీన్, సంపత్, రఫీ, వేల్పుల శివ, నాగేల్లి అరుణ్ కుమార్, అక్కేనపల్లి జానయ్య, మద్దెబోయిన శ్రీనివాస్, పడిదల రవి, నరేందర్ నాయుడు, ఖమ్మంపాటి మధుకర్, దండా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News