చిట్యాల: తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల, మున్సిపల్ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం పార్టీ శ్రేణుల ఉత్సాహభరిత నినాదాలు, అభిమానుల సందడితో ఉత్సవ వాతావరణంలో సాగింది. ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి