సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి:
తిరుమలగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతులను ఒడియాల శ్రీనివాస్ (58), జ్యోతి (52)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో తిరుమలగిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి