Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులో విషాదం.. ఛాతినొప్పితో యువ రీసెర్చ్ స్కాలర్ మృతి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 04:34 PM

తాళ్లపల్లిగూడలో భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతం

25-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తాళ్లపల్లిగూడ, జూలై 25: శయన ఏకాదశి సందర్భంగా తాళ్లపల్లిగూడ గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్రతంలో గ్రామానికి చెందిన దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వ్రతం అనంతరం సాయంత్రం భజన సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ డా. బిక్షపతి, గ్రామ సర్పంచ్ జోగు శంకర్, గ్రామ పెద్దలు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తాళ్లపల్లిగూడలో భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతం

Article Image

తాళ్లపల్లిగూడ, జూలై 25: శయన ఏకాదశి సందర్భంగా తాళ్లపల్లిగూడ గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్రతంలో గ్రామానికి చెందిన దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వ్రతం అనంతరం సాయంత్రం భజన సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ డా. బిక్షపతి, గ్రామ సర్పంచ్ జోగు శంకర్, గ్రామ పెద్దలు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News