Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:13 PM

వీడ్కోలు సభలో సత్యయ్య సేవలను కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

25-07-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా విశిష్ట సేవలు అందించి ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొందిన సత్యయ్యకు ఏర్పాటు చేసిన అభినందన, వీడ్కోలు సభలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యయ్యను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సత్యయ్య మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో విశేష సేవలు అందించారని, బాధ్యతలను నిష్ఠతో, సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని కొనియాడారు. ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొందడం ఆనందదాయకమని పేర్కొంటూ, కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకుని ప్రజాసేవలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు,ఉపసర్పంచులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వీడ్కోలు సభలో సత్యయ్య సేవలను కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా విశిష్ట సేవలు అందించి ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొందిన సత్యయ్యకు ఏర్పాటు చేసిన అభినందన, వీడ్కోలు సభలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యయ్యను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సత్యయ్య మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో విశేష సేవలు అందించారని, బాధ్యతలను నిష్ఠతో, సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని కొనియాడారు. ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొందడం ఆనందదాయకమని పేర్కొంటూ, కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకుని ప్రజాసేవలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు,ఉపసర్పంచులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News