Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:16 PM

పాదచారుల సౌకర్యమే లక్ష్యం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ పోలీసులు

26-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, జూలై 25: నగరంలో పాదచారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణలపై వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. భాగ్యలత నుంచి హైకోర్టు కాలనీ కమాన్ వరకు సర్వీస్ రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన ఫర్నిచర్ దుకాణాలు, పండ్ల వ్యాపారులు, ఇతర వాణిజ్య సంస్థల ఆక్రమణలను అధికారులు తొలగించారు.

డ్రైవ్ సందర్భంగా వ్యాపారులకు ట్రాఫిక్ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఫుట్‌పాత్‌లపై ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవద్దని, ప్రజలు మరియు పాదచారులకు ఇబ్బందులు కలిగేలా వస్తువులను రహదారులపై ఉంచవద్దని సూచించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్‌ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Sthanikam

పాదచారుల సౌకర్యమే లక్ష్యం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ పోలీసులు

Article Image

ఎల్బీనగర్, జూలై 25: నగరంలో పాదచారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణలపై వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. భాగ్యలత నుంచి హైకోర్టు కాలనీ కమాన్ వరకు సర్వీస్ రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన ఫర్నిచర్ దుకాణాలు, పండ్ల వ్యాపారులు, ఇతర వాణిజ్య సంస్థల ఆక్రమణలను అధికారులు తొలగించారు.

డ్రైవ్ సందర్భంగా వ్యాపారులకు ట్రాఫిక్ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఫుట్‌పాత్‌లపై ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవద్దని, ప్రజలు మరియు పాదచారులకు ఇబ్బందులు కలిగేలా వస్తువులను రహదారులపై ఉంచవద్దని సూచించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్‌ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News