Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:06 PM

సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలి

26-07-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్‌లోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగారెడ్డి జిల్లా స్థాయి సామాజిక ఉద్యమ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ, దేశంలో కుల వివక్ష, సామాజిక అసమానతలను నిర్మూలించాలంటే అన్ని కులాల్లోని పీడిత వర్గాలు ఐక్యంగా వర్గ పోరాట దృక్పథంతో ముందుకు రావాలని అన్నారు. కుల సమస్యను ఒక వర్గానికి చెందిన సమస్యగా కాకుండా దేశ సమస్యగా చూడాలని, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు బలమైన సామాజిక ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థి ఉద్యమాల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థి ఉద్యమ విజయమని అభివర్ణిస్తూ, ఉద్యోగాలు, విద్యా హక్కుల కోసం యువత మరింత చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్యం మాట్లాడుతూ జిల్లాలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేస్తూ ఉద్యమాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మద్దూరి శివకుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి పెద్దాపురం అశోక్ శిక్షణ ఇచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్, కొఠారి నర్సింహులు, గణపతి, మల్లేష్, సంతోష్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, జైకుమార్, అరుణ్, చరణప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News