Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:12 PM

ఆపదలో అండగా.. మహేష్ కుటుంబానికి రూ.4.10 లక్షల భరోసా.

26-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూదాన్ పోచంపల్లి,

కష్టకాలంలో సభ్యుడి కుటుంబానికి అండగా నిలిచి యాదాద్రి భువనగిరి ఫొటో–వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. ఇటీవల మృతి చెందిన రామన్నపేట మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్ నకిరేకంటి మహేష్ కుటుంబానికి సంఘం తరఫున రూ.4.10 లక్షల ఆర్థిక సాయం అందజేసింది.

భూదాన్ పోచంపల్లిలో ఆదివారం నిర్వహించిన యాదాద్రి భువనగిరి ఫొటో–వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

మహేష్ సంఘం నిర్వహిస్తున్న 'రూ.10 భరోసా', 'రూ.100 భరోసా' సంక్షేమ పథకాల సభ్యుడు కావడంతో నిబంధనల మేరకు రూ.4,10,000 మంజూరు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు.

సభ్యుల కుటుంబాలకు భరోసాగా సంక్షేమ పథకాలు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ.. సభ్యుల సంక్షేమమే సంఘం ప్రధాన ధ్యేయమని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడానికే ఈ భరోసా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఫొటోగ్రాఫర్ సంక్షేమ పథకాలలో సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, ఫొటో–వీడియోగ్రాఫర్లు, మహేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో అండగా.. మహేష్ కుటుంబానికి రూ.4.10 లక్షల భరోసా.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News