Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:12 PM

టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షుడు గా ప్రవీణ్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నర్సింగు కోటయ్య.

26-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) నల్గొండ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల ప్రధాన అధికారిగా డాక్టర్ బి. వీరన్న వ్యవహరించగా, డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి ప్యానెల్ సభ్యులు జిల్లా బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జిల్లా అధ్యక్షుడిగా నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం సహాయ ఆచార్యుడు కే. ప్రవీణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్జీ కళాశాల (అటానమస్) నల్గొండకు చెందిన చరిత్ర విభాగం సహాయ ఆచార్యుడు నర్సింగు కోటయ్య, జిల్లా కోశాధికారిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)కు చెందిన ఈ. రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోపి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బెల్లి యాదయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజారామ్ అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజారామ్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక ఉన్నత విద్యా అధ్యాపకుల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నూతన ప్రధాన కార్యదర్శి నర్సింగు కోటయ్య మాట్లాడుతూ జిల్లా ప్రాథమిక సభ్యుల సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, ఉద్యోగుల హక్కులు, గౌరవ పరిరక్షణకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

కార్యక్రమంలో ప్రొఫెసర్ అరవింద, డాక్టర్ వెంకటకృష్ణ, ఈ. రాంరెడ్డి, సీహెచ్ అజయ్‌కుమార్, డాక్టర్ హరిత, ఎం. వెంకటరెడ్డి, కె. శివరాణి, గంజి శ్రీనివాస్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షుడు గా ప్రవీణ్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నర్సింగు కోటయ్య.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News