Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

రాజగోపాల్‌రెడ్డి జోలికొస్తే ఊరుకోం: పెద్దగోని రమేష్‌గౌడ్‌

26-07-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​• తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్‌పై టీపీసీసీ నేత తీవ్ర ఆగ్రహం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్‌గౌడ్ హెచ్చరించారు. ఉద్యమకారుడినని చెప్పుకునే తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే గతంలో కేసీఆర్ ఆయనను పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు.​రాజగోపాల్‌రెడ్డి సాయంతోనే తనకు టికెట్ వచ్చిందని గతంలో మీడియా ముందే చెప్పిన సామెల్, ఇప్పుడు ఆయనపైనే ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ఈ విషయమై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, రేణుక ఎల్లమ్మ సమక్షంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. తుంగతుర్తిలో సామెల్ సాగిస్తున్న అక్రమ వసూళ్లు అందరికీ తెలుసని, ధైర్యముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపాలని సవాల్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Sthanikam

రాజగోపాల్‌రెడ్డి జోలికొస్తే ఊరుకోం: పెద్దగోని రమేష్‌గౌడ్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News