Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

బాలాజీ నగర్ లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

26-07-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సరైన పత్రాలు లేని 25 బైకులు, ఒక కారు సీజ్.

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్‌లో పోలీసులు ఆదివారం భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్ఐలతో పాటు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం నుండి గంజాయి మహమ్మారిని పూర్తిగా తరిమివేసి, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు కష్టార్జితాన్ని వృథా చేసుకోకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. పట్టణంలో ఇళ్ల యజమానులు కొత్తవారికి, గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు..

Sthanikam

బాలాజీ నగర్ లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News