Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:16 PM

జాతీయ స్థాయిలో కొప్పుల వెంకట్‌రెడ్డికి అరుదైన గౌరవం. 'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు అందజేత.

26-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

మోటకొండూరు మండలం కొండాపురం గ్రామ సర్పంచ్, యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొప్పుల వెంకట్‌రెడ్డికి 'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్‌లో జరిగిన వేడుకలో నేషనల్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేశారు.గ్రామాభివృద్ధి, సామాజిక సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కొప్పుల వెంకట్‌రెడ్డి అందించిన విశేష సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తూ ఆదర్శ సర్పంచ్‌గా నిలిచారని ప్రశంసించారు.

అవార్డు స్వీకరించిన అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, "పదవి కోసం కాదు... ప్రజాసేవ కోసం పనిచేశాను. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకమే ఈ జాతీయ గౌరవానికి కారణం" అని అన్నారు.గ్రామంలో రూ.50 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టామని, ఆరు గ్రామాల ప్రజల చిరకాల కల అయిన వంతెన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తెలిపారు. మోటకొండూరు మండలానికి స్వర్గపురి రథాన్ని అందజేయడంతో పాటు ప్రజల అవసరాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నానని పేర్కొన్నారు.

ఈ గౌరవాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నానని, రాబోయే రోజుల్లో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ స్థాయిలో కొప్పుల వెంకట్‌రెడ్డికి అరుదైన గౌరవం. 'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు అందజేత.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News