Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:48 PM

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు..

26-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నల్లగొండ–సూర్యాపేట మార్గాన్నే కొనసాగించాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి

శంషాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అలైన్‌మెంట్ మారే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో శంషాబాద్–నల్లగొండ–సూర్యాపేట మార్గంలోనే బుల్లెట్ ట్రైన్‌ను తీసుకురావాలని ప్రతిపాదనలు వెలువడటంతో ఈ ప్రాంత ప్రజల్లో భారీ ఆశలు చిగురించాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు బుల్లెట్ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

బుల్లెట్ ట్రైన్ అన్ని రైల్వే స్టేషన్లలో ఆగకపోయినా, జిల్లా కేంద్రాలైన నల్లగొండ, సూర్యాపేటలకు సమీపంలో స్టేషన్లు ఏర్పాటు చేస్తే విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్–చెన్నై మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.

అయితే, గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను మార్చి మరో మార్గంలో బుల్లెట్ ట్రైన్‌ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ ప్రాజెక్టు దూరమైతే భవిష్యత్ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పునరాలోచన చేసి, మొదట ప్రతిపాదించిన శంషాబాద్–నల్లగొండ–సూర్యాపేట మార్గాన్నే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు ఈ అంశాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా అమలైతే ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, విద్యా, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు..

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News