Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:13 PM

హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు

27-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల పరిధిలోని దోసపల్లి గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బిరదర్ దత్తు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ మరో హామీని నెరవేర్చారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో జడ్‌పీహెచ్‌ఎస్ మనూరు పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహించారు. బిరదర్ అపర్ణకు ప్రథమ బహుమతిగా రూపాయలు 5,100, బిరదర్ శ్రీనిజకు ద్వితీయ బహుమతిగా రూపాయలు 2,500 అందజేయడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిరదర్ దత్తు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలు, డాక్టర్ అమృత్, రాజశేఖర్, అశోక్, సత్యనారాయణ, నారాయణ, రాజ్‌కుమార్, రవికుమార్, జయరాజ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల పరిధిలోని దోసపల్లి గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బిరదర్ దత్తు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ మరో హామీని నెరవేర్చారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో జడ్‌పీహెచ్‌ఎస్ మనూరు పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహించారు. బిరదర్ అపర్ణకు ప్రథమ బహుమతిగా రూపాయలు 5,100, బిరదర్ శ్రీనిజకు ద్వితీయ బహుమతిగా రూపాయలు 2,500 అందజేయడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిరదర్ దత్తు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలు, డాక్టర్ అమృత్, రాజశేఖర్, అశోక్, సత్యనారాయణ, నారాయణ, రాజ్‌కుమార్, రవికుమార్, జయరాజ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News