ఇంద్రపాలనగరం, జూలై 27: ఇంద్రపాలనగరానికి చెందిన నల్ల పాపయ్య అకాల మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఆయన మృతదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పాపయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, ఈర్లపల్లి మల్లయ్య, రాస వెంకటేష్, చేనేత సహకార సంఘం చైర్మన్ రవ్వ నర్సింహా, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య యాదవ్, మాజీ వార్డు సభ్యులు నిమ్మగడ్డ పద్మారావు, పగుడాల వెంకటేష్, నక్క వెంకటేష్, రాజన్నగారి మురళి, నల్ల శంకరయ్య, కొమ్మగోని సంజీవ్, కాటేపల్లి మహేష్, మాధం నగేష్ తదితరులు పాల్గొని పాపయ్యకు నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి