నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో నాగూర్ (కే) గ్రామ శివారులో వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ పత్తి పంటను పరిశీలించి రైతులకు పంట సంరక్షణపై అవగాహన కల్పించారు. రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా దోమ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రైతు పసుపు, నీలం జిగురు అట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి వినియోగంతో ప్రారంభ దశలోనే పురుగులను నియంత్రించి, పురుగుల మందుల పిచికారీ ఖర్చును తగ్గించుకోవచ్చని తెలిపారు. అలాగే యూరియాను అవసరానికి మించి వాడకూడదని, అధిక యూరియా వల్ల మొక్కలు అతిగా పెరిగి దోమలు, ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సమతుల్య ఎరువుల వాడకం, జిగురు అట్టల వినియోగంతో పత్తి పంటను ఆరోగ్యంగా కాపాడుకుని మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
PRINT TIME: September 21, 2026 09:09 PM
యూరియా అధిక వాడకం వద్దు.. పత్తి రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు

27-07-2026
160 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో నాగూర్ (కే) గ్రామ శివారులో వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ పత్తి పంటను పరిశీలించి రైతులకు పంట సంరక్షణపై అవగాహన కల్పించారు. రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా దోమ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రైతు పసుపు, నీలం జిగురు అట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి వినియోగంతో ప్రారంభ దశలోనే పురుగులను నియంత్రించి, పురుగుల మందుల పిచికారీ ఖర్చును తగ్గించుకోవచ్చని తెలిపారు. అలాగే యూరియాను అవసరానికి మించి వాడకూడదని, అధిక యూరియా వల్ల మొక్కలు అతిగా పెరిగి దోమలు, ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సమతుల్య ఎరువుల వాడకం, జిగురు అట్టల వినియోగంతో పత్తి పంటను ఆరోగ్యంగా కాపాడుకుని మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి