Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

ప్రజావాణికి 136 వినతులు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

27-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి, జూలై 27 ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 136 ఫిర్యాదులు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు 54, ఇతర శాఖలకు 82 వినతులు నమోదయ్యాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజావాణికి 136 వినతులు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

Article Image

రంగారెడ్డి, జూలై 27 ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 136 ఫిర్యాదులు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు 54, ఇతర శాఖలకు 82 వినతులు నమోదయ్యాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News