Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

ఫైర్ స్టేషన్‌ను తుంగతుర్తిలోనే ఏర్పాటు చేయాలి: తాటికొండ సీతయ్య

29-07-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఫైర్ స్టేషన్‌ను తుంగతుర్తిలోనే ఏర్పాటు చేయాలి:

తాటికొండ సీతయ్య

నియోజకవర్గ కేంద్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్

లేదంటే తుంగతుర్తి అభివృద్ధి మరింత వెనుకబడుతుందని ఆందోళన

తుంగతుర్తి, జూలై తుంగతుర్తి నియోజకవర్గానికి మంజూరైన ఫైర్ స్టేషన్‌ను తప్పనిసరిగా తుంగతుర్తి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న ఫైర్ స్టేషన్ మంజూరు కావడం సంతోషకరమైన విషయమని, అయితే దానిని నియోజకవర్గ కేంద్రం కాకుండా వేరే ప్రాంతానికి తరలిస్తే తుంగతుర్తి అభివృద్ధికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం కావడంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాలకు కేంద్ర బిందువుగా ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా తుంగతుర్తిలో ఏర్పాటు కావాల్సిన మార్కెట్ యార్డును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలించడం వల్ల మండల అభివృద్ధి వెనుకబడిందని గుర్తు చేశారు.అదే విధంగా ప్రస్తుతం ఫైర్ స్టేషన్‌ను తిరుమలగిరికి మార్చే ప్రయత్నాలు జరిగితే తుంగతుర్తి అభివృద్ధి మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్‌ను తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, పోలేపాక సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫైర్ స్టేషన్‌ను తుంగతుర్తిలోనే ఏర్పాటు చేయాలి: తాటికొండ సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News