Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

హైడ్రా చర్యలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న

29-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రా వ్యవస్థ ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులు వంటి ఉమ్మడి ఆస్తులను పరిరక్షించేందుకు కీలకంగా పనిచేస్తోందని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజలకు చెందిన భూములను అక్రమంగా ఆక్రమించిన వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల ఆధీనంలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.హైడ్రా చర్యలను అడ్డుకునే ఉద్దేశంతో కొందరు అక్రమ ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైడ్రా కార్యకలాపాలను మరింత సమర్థంగా కొనసాగించాలని కోరారు.గతంలో హైదరాబాద్‌లో స్వల్ప వర్షాలకే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో రోడ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువులు, నాలాలు, కుంటల పరిరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను కాపాడే అవకాశం ఏర్పడిందన్నారు.తెలంగాణ ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు, యువత, ఉద్యమకారులు, కవులు, కళాకారులు హైడ్రా చేపడుతున్న ప్రజా ప్రయోజన చర్యలకు మద్దతు తెలపాలని వెంకన్న పిలుపునిచ్చారు.ఉమ్మడి ఆస్తుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

హైడ్రా చర్యలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News