Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:54 PM

సూర్యాపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

29-07-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది తెలిపారు.

పట్టణానికి తాగునీరు అందించే వాటర్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్‌లను పరిశీలించి, వాటిని పునరుద్ధరించి ప్రజలకు నాణ్యమైన తాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతరాయంగా సమృద్ధిగా తాగునీరు అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

పట్టణంలో తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, అవసరమైన చోట్ల పైప్‌లైన్ల విస్తరణ, మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం వంటి పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, "సూర్యాపేటలో ప్రతి కుటుంబానికి నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మా లక్ష్యం" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, ధారవత్ వీరన్న నాయక్, కౌన్సిలర్లు సండ్రపాటి విజయ్ కుమార్, బండారు మంగమ్మ, కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, షేక్ జహీర్, గుణగంటి హేమ సతీష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లింగా నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, సాజిద్ ఖాన్, నరేందర్ నాయుడు, రాచకొండ శ్రీనివాస్, సైదిరెడ్డి (మార్బుల్), జూలకంటి నాగరాజు, జిన్నా చంద్రారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News