Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:52 PM

గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

29-07-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకుని సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గురువే జ్ఞానానికి మార్గదర్శి అని, గురుపౌర్ణమి గురువు మహోన్నత స్థానాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. గురువుల బోధనలు వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ అభ్యున్నతికి కూడా ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ గురువులను గౌరవిస్తూ వారు చూపిన సన్మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, స్థానిక కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, షేక్ జహీర్, గుణగంటి హేమ సతీష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బెలిడే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, నరేష్ పిళ్లే, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News