నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలను ఉపాధ్యాయులు స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీటం శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్ పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని, గురువులను గౌరవించడం భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తాటి చంద్రమౌళి, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి యాదగిరితో పాటు ఉపాధ్యాయులు కైలాసం, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, రవీందర్, యశోదరా రెడ్డి, రాధా, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 09, 2026 01:12 PM
పెద్దకాపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

29-07-2026
23 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలను ఉపాధ్యాయులు స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీటం శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్ పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని, గురువులను గౌరవించడం భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తాటి చంద్రమౌళి, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి యాదగిరితో పాటు ఉపాధ్యాయులు కైలాసం, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, రవీందర్, యశోదరా రెడ్డి, రాధా, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి