Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి

29-07-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బిసీవై పార్టీ ప్యాక్ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్

చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమాలు చేపడతామని బిసీవై పార్టీ తెలంగాణ ప్యాక్ సభ్యులు డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​పరిశ్రమలు స్థానిక ప్రజల భూములు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వనరులను వాడుకుంటూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో తీవ్ర అలసత్వం వహిస్తున్నాయని మండిపడ్డారు. కంపెనీల ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల చదువుకున్న స్థానిక యువత వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి స్థానికులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ​అలాగే కార్మిక, అగ్నిమాపక, పర్యావరణ భద్రతా నిబంధనలను పాటించని పరిశ్రమలపై అధికారులు తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులను స్థానిక గ్రామాల అభివృద్ధి, బడులు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వెచ్చించాలన్నారు. హక్కుల సాధన కోసం నిరుద్యోగ యువత ముందుకు రావాలని, వారికి బిసీవై పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎం.డి. జావేద్, కార్యదర్శులు పి. శ్రీనివాస్, అడేపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News