Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది. నాలుగు ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..

30-07-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మరో నాలుగు కోర్సులకు త్వరలోనే అనుమతి ఆశాభావం

హైదరాబాద్, జూలై 30 : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విద్యా రంగంలో కీలక ముందడుగు వేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు ఆన్‌లైన్ కోర్సులు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. దేశంలోనే తొలి ఓపెన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన బ్రౌ త్వరలో పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందనుందని వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు.

సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విద్యా సంవత్సరానికి ఎనిమిది కోర్సులకు దరఖాస్తు చేయగా, ఎం.ఏ. (తెలుగు), ఎం.కామ్, బి.కామ్ (ఇంగ్లీష్ మీడియం), బి.కామ్ (తెలుగు మీడియం) కోర్సులకు యూజీసీ ఆమోదం తెలిపింది. మిగిలిన నాలుగు కోర్సులకు సంబంధించి యూజీసీ సూచనలు అందాయని, వాటిని పూర్తి చేసి త్వరలోనే అనుమతులు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కెనడాలో అధికారిక పర్యటనలో ఉన్న వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడి సిబ్బందిని అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని విద్యా కార్యక్రమాలను క్రమంగా ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తూ బ్రౌను పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

యూజీసీ నిర్ణయాన్ని రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, డీన్లు, డైరెక్టర్లు స్వాగతించారు. నాణ్యమైన ఉన్నత విద్యను డిజిటల్ వేదికల ద్వారా మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలక ఘట్టమని పేర్కొన్నారు. కొత్తగా ఆమోదం పొందిన కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.

Sthanikam

డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది. నాలుగు ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News