Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

కుట్టుమిషన్‌తో కొత్త జీవితం.. 30 మంది మహిళలకు ఉచిత పంపిణీ.

30-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ ప్రతినిధి:

మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించే మరో ముందడుగు పడింది. ఆరు నెలల పాటు కుట్టు శిక్షణ పూర్తి చేసిన 30 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, కుట్టు మెటీరియల్ అందజేశారు. యూత్ ఫర్ సేవా, సర్వీస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ నగరంలోని హిమగిరి కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. యూత్ పర్సే సేవా

సహకారంతో ఐదో బ్యాచ్‌కు చెందిన శిక్షణార్థినులకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాప్టర్ అడ్వైజరీ సభ్యులు సుధారాణి, భరద్వాజ్, యూత్ ఫర్ సేవా సీఎస్‌ఆర్ మేనేజర్ ప్రవీణ్ సింగ్, లైవ్లీహుడ్ మేనేజర్ విశ్వతేజ, జిల్లా కోఆర్డినేటర్ నాగేందర్, ఉపాధి శిక్షకురాలు నాగమణి చేతుల మీదుగా మిషన్లు అందజేశారు.వారు

మాట్లాడుతూ.. "మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతోనే ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాం. నేర్చుకున్న నైపుణ్యాలతో స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి అండగా నిలవాలి" అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ప్రతినిధులు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

కుట్టుమిషన్‌తో కొత్త జీవితం.. 30 మంది మహిళలకు ఉచిత పంపిణీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News