Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్ఎస్ ఆందోళన.. కమిషనర్‌కు వినతి

30-07-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎంఫీఎల్ (MPL) సహా పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్య పొగ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ గురువారం మున్సిపల్ కమిషనర్ గురులింగంకు వినతిపత్రం సమర్పించారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి పరిశ్రమలను వెంటనే తనిఖీ చేసి, కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరును పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో దుర్వాసన వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్ఎస్ ఆందోళన.. కమిషనర్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News