నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జన్వాడే సంతోష్‌కు చెందిన పాత ఇల్లు పూర్తిగా కూలిపోగా, అది పక్కనే ఉన్న ఆయన సోదరుడు జన్వాడే శ్రీకాంత్ ఇటీవల నిర్మించిన ఇంటిపై పడటంతో ఆ ఇల్లు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇంటి తగడలు, వాటర్ ట్యాంక్, పైపులు తదితర సామగ్రి ధ్వంసమై సుమారు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందించాలని బాధితులు జన్వాడే సంతోష్, జన్వాడే శ్రీకాంత్ కోరారు.
PRINT TIME: September 21, 2026 09:10 PM
భారీ వర్షం దెబ్బకు రెండు ఇళ్లు ధ్వంసం.. ప్రభుత్వ సాయం కోరుతున్న బాధితులు

30-07-2026
130 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జన్వాడే సంతోష్‌కు చెందిన పాత ఇల్లు పూర్తిగా కూలిపోగా, అది పక్కనే ఉన్న ఆయన సోదరుడు జన్వాడే శ్రీకాంత్ ఇటీవల నిర్మించిన ఇంటిపై పడటంతో ఆ ఇల్లు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇంటి తగడలు, వాటర్ ట్యాంక్, పైపులు తదితర సామగ్రి ధ్వంసమై సుమారు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందించాలని బాధితులు జన్వాడే సంతోష్, జన్వాడే శ్రీకాంత్ కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి