Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:09 PM

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి

30-07-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలోని కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో గురువారం సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను అవసరం లేకుండా బయటకు పంపవద్దని, పాడుబడిన లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, వాగులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లలు, యువకులు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే విద్యుత్ స్థంబాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు మోటార్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలను కోరారు.

Sthanikam

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News