Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:17 PM

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై కలెక్టర్ అలర్ట్.. తాగునీటి సంక్షోభం నివారణకు ముందస్తు చర్యలు..

30-07-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చందంపేట:

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ శాఖ అధికారులు గ్రామాల వారీగా నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరిపై ఆధారపడకుండా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కందులు, కూరగాయలు, కీరదోస వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుభూములను పడావుగా ఉంచకుండా రైతులకు అవసరమైన సలహాలు, సహకారం అందించాలని పేర్కొన్నారు.

ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను ఎంత మేరకు అవసరమైనా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టేలా మండల వ్యవసాయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు, వర్షాభావ ప్రభావాన్ని తగ్గించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Sthanikam

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై కలెక్టర్ అలర్ట్.. తాగునీటి సంక్షోభం నివారణకు ముందస్తు చర్యలు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News