Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ గోపాతి సతీష్

30-07-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

నీటితో నిండిన రహదారులపై వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. అలాగే వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆలస్యం చేయకుండా 100 (పోలీస్), 101 (అగ్నిమాపక), 108 (అంబులెన్స్), 1077 (విపత్తు నిర్వహణ) హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, అవసరమైన సహాయం కోసం రామన్నపేట పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్‌ఐ గోపాతి సతీష్ స్పష్టం చేశారు.

Sthanikam

భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ గోపాతి సతీష్

Article Image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

నీటితో నిండిన రహదారులపై వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. అలాగే వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆలస్యం చేయకుండా 100 (పోలీస్), 101 (అగ్నిమాపక), 108 (అంబులెన్స్), 1077 (విపత్తు నిర్వహణ) హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, అవసరమైన సహాయం కోసం రామన్నపేట పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్‌ఐ గోపాతి సతీష్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News