Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన

30-07-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తట్టి అన్నారం 2బీహెచ్‌కే సముదాయంలో పార్కు స్థలాన్ని మతపరమైన వినియోగానికి ఉపయోగించొద్దని విజ్ఞప్తి.

హైదరాబాద్, తట్టి అన్నారం:

తట్టి అన్నారం ప్రాంతంలోని 2బీహెచ్‌కే గృహ సముదాయంలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ప్రజల వినియోగానికే పరిమితం చేయాలని స్థానిక సామాజిక కార్యకర్త నవీన్ రెడ్డి వరకాంతం డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం నిర్మించిన 1,268 ఫ్లాట్ల సముదాయంలో రంజాన్ మాసం సందర్భంగా తాత్కాలికంగా ప్రార్థనలు నిర్వహించేందుకు 30 రోజుల అనుమతి తీసుకున్నప్పటికీ, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ ఏర్పాట్లను తొలగించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు నాగోల్ పోలీస్ స్టేషన్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పార్కు స్థలం అనేది చిన్నారులు, మహిళలు, వృద్ధులు వినియోగించేందుకు ఉద్దేశించిన ప్రజా స్థలమని, దానిని ఏ మతపరమైన లేదా ఇతర శాశ్వత కార్యకలాపాలకు వినియోగించకుండా పరిరక్షించాలని నవీన్ రెడ్డి కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్కు స్థలాన్ని అసలు ప్రయోజనానికే ఉపయోగించేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్కు స్థలాన్ని పరిరక్షించాలని నవీన్ రెడ్డి వరకాంతం అధికారులను కోరారు.

Sthanikam

పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News