Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:11 PM

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి – అవగాహన కార్యక్రమంలో పిలుపు

30-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ, సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఎద్దుమైలారంలోని పీఎంసీ కేంద్రీయ విద్యాలయం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా సమాజానికి అత్యంత ప్రమాదకరమైన నేరమని, ఉద్యోగాలు, ఉన్నత విద్య, వివాహం, విదేశీ ఉపాధి పేరుతో అమాయకులను మోసం చేసి అక్రమ రవాణాకు గురిచేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు ఇలాంటి మోసాలకు ఎక్కువగా గురవుతున్నారని చెప్పారు. మానవ అక్రమ రవాణా వల్ల బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ, బిచ్చాటన, అవయవాల అక్రమ వ్యాపారం వంటి నేరాలు పెరుగుతున్నాయని, అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసు శాఖ లేదా సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు అపరిచితులను నమ్మకుండా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, విదేశీ ఉపాధి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రత, చదువు, ఆన్‌లైన్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.జిల్లా బాలల రక్షణ అధికారి రత్నం మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యం హక్కు అని, పిల్లల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు విద్యార్థులకు మానవ అక్రమ రవాణా నివారణ, బాలల హక్కులు, సురక్షిత జీవనం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ముగింపులో అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భారతీ దేవి, డీసీపీయూ కోఆర్డినేటర్ కల్పన, సఖి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి, ఏహెచ్‌టీయూ ప్రతినిధులు మాణిక్ రెడ్డి, ఎండి అలీ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది విశాల, నరసింహులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి – అవగాహన కార్యక్రమంలో పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News