Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:13 PM

స్త్రీనిధి ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం ఘన విజయం.. సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

30-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

స్త్రీనిధి క్రెడిట్ ఫెడరేషన్ పాలకవర్గ ఎన్నికల్లో సంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల డైరెక్టర్‌గా ఘన విజయం సాధించిన హీనా బేగంను నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి సంస్థ ఎంతో కీలకంగా పనిచేస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చడంలో ఈ సంస్థ విశేష పాత్ర పోషిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం ఎన్నిక కావడం అభినందనీయమని, మహిళా సంఘాల అభివృద్ధి, మహిళలకు రుణాలు సకాలంలో అందేలా మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.హీనా బేగం మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన సంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల మహిళా సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన మార్గదర్శకత్వంలో మహిళల సంక్షేమం కోసం, స్త్రీనిధి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ మహిళకు చేరేలా అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రహీం, స్థానిక నాయకుడు గౌస్ చిస్తి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్త్రీనిధి ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం ఘన విజయం.. సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

Article Image

స్త్రీనిధి క్రెడిట్ ఫెడరేషన్ పాలకవర్గ ఎన్నికల్లో సంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల డైరెక్టర్‌గా ఘన విజయం సాధించిన హీనా బేగంను నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి సంస్థ ఎంతో కీలకంగా పనిచేస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చడంలో ఈ సంస్థ విశేష పాత్ర పోషిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం ఎన్నిక కావడం అభినందనీయమని, మహిళా సంఘాల అభివృద్ధి, మహిళలకు రుణాలు సకాలంలో అందేలా మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.హీనా బేగం మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన సంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల మహిళా సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన మార్గదర్శకత్వంలో మహిళల సంక్షేమం కోసం, స్త్రీనిధి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ మహిళకు చేరేలా అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రహీం, స్థానిక నాయకుడు గౌస్ చిస్తి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News