తుంగతుర్తి: రేషన్ కార్డుల ధ్రువీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్నందున దానిని మరింత పొడిగించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డుల ధ్రువీకరణను ఒక నిర్దిష్ట గడువుతో పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అన్నారు. ఇంకా ధ్రువీకరణ పూర్తి చేయించుకోలేని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా రేషన్ సరుకులను అందించాలని డిమాండ్ చేశారు.సాంకేతిక సమస్యలు, అవగాహన లోపం, ఇతర కారణాలతో అనేక మంది లబ్ధిదారులు ధ్రువీకరణ పూర్తి చేయలేకపోయారని, అలాంటి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి గడువును పొడిగించాలని తాటికొండ సీతయ్య విజ్ఞప్తి చేశారు.
PRINT TIME: October 10, 2026 11:26 AM
రేషన్ కార్డుల ధ్రువీకరణ గడువును పొడిగించాలి; సీతయ్య

30-07-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి: రేషన్ కార్డుల ధ్రువీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్నందున దానిని మరింత పొడిగించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డుల ధ్రువీకరణను ఒక నిర్దిష్ట గడువుతో పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అన్నారు. ఇంకా ధ్రువీకరణ పూర్తి చేయించుకోలేని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా రేషన్ సరుకులను అందించాలని డిమాండ్ చేశారు.సాంకేతిక సమస్యలు, అవగాహన లోపం, ఇతర కారణాలతో అనేక మంది లబ్ధిదారులు ధ్రువీకరణ పూర్తి చేయలేకపోయారని, అలాంటి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి గడువును పొడిగించాలని తాటికొండ సీతయ్య విజ్ఞప్తి చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి