Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఎమ్మెల్యే మందుల సామేల్; మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

30-07-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఫైర్ స్టేషన్‌ను మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు నియోజకవర్గ ప్రజల తరఫున, ముఖ్యంగా తుంగతుర్తి మండల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న బీఎన్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ఒప్పించి, ఫైర్ స్టేషన్ ఫైల్‌పై ఆమోదం పొందేలా కృషి చేసిన ఎమ్మెల్యే మందుల సామేలుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఫైర్ స్టేషన్‌ను తుంగతుర్తికి తీసుకురావడం ప్రజల కల సాకారం చేసినట్లేనని అన్నారు.నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని వెంకన్న పేర్కొన్నారు. "మందుల సామేలు అంటే తుంగతుర్తి.. తుంగతుర్తి అంటే మందుల సామేలు" అనే స్థాయిలో ప్రజల మనసుల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.గతంలో తుంగతుర్తికి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకురావడంలో కూడా ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు అసెంబ్లీలో తుంగతుర్తి సమస్యలను నిరంతరం ప్రస్తావిస్తూ, వారంలో ఎక్కువ రోజులు నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న నాయకుడు మందుల సామేలేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చింతకుంట్ల వెంకన్న బీఎన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఎమ్మెల్యే మందుల సామేల్; మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News