Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:54 PM

ఎయిడ్స్ అంతర్జాతీయ దినోత్సవం

ఎయిడ్స్ అంతర్జాతీయ దినోత్సవం

ఎయిడ్స్ అంతర్జాతీయ దినోత్సవం
May 18, 2026 12:25 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హెచ్ఐవి ఎయిడ్స్ తో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్షను రూపుమాపాలని జిల్లా లెప్రసీ ,ఎయిడ్స్ మరియు టిబి అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆద్వర్యం లో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యాంజలి దినము నిర్వహించారు .ఈ కార్యక్రమాన్ని పచ్చ జండా ఊపి ప్రారంబించారు . HIV/AIDS తో చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి Y జంక్షన్ వరుకు వెళ్ళి తిరిగి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వరకు ర్యాలీ చెయ్యడం జరిగింది .

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యంజలి దినము " అనేది 1983 లో ప్రారంభమై ప్రతీ సంవత్సరం మే నెలలో 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని 115 దేశాలలో సుమారు 1,200 కమ్యూనిటీ సంస్థల ద్వారా నిర్వహించబడుతున్నది. 43వ “అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యాంజలి దినము ఈ సంవత్సరం వారసత్వాన్ని వెలిగించండి, మేము గుర్తుంచుకుంటాం, మేము అవగాహనతో ముందుకువెళ్తాం, మేము చర్య తీసుకుంటాం అనే నినాదం తో ఈ స్మారక దినాన్ని జరుపుకుంటున్నాము.

ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా HIV/AIDS తో చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు మరియు HIV/AIDS తో జీవిస్తున్న వార్కి మేమున్నాము అనే భరోసా ఇవ్వడం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశ్యం . సమాజంలో HIV మరియు AIDS గురించి సామాజిక స్పృహను పెంచడానికి, ప్రపంచ వ్యాప్తంగా HIV/AIDS తో నివసించే 38 మిలియన్ల మంది ప్రజలు, "అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యంజలి పురస్కరించుకుని ప్రపంచ స్ధాయీలో సంఘీభావం తెలపడం, HIV/AIDSతో నివసించే వారి పట్ల కళంకం మరియు వివక్ష యొక్క అడ్డంకులను విచ్ఛిన్నం చేయడం మరియు నూతన తరాలకు సందేశాన్ని అందిస్తారు అని తెలిపారు .

ఈ సందర్బంగా హెచ్‌ఐ‌వి / ఎయిడ్స్ నియంత్రణ జిల్లా సూపర్ వైజర్ జి. వి. రమణ మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో HIV/AIDS తో ART సెంటర్ల నందు ప్రస్తుతం సుమారు 2,34,000 మందికి పైగా ART మందులు వాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరికి అన్ని రకాలుగా ఉచిత వైద్య , చికిత్స మరియు ఔషధంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్ధ ద్వారా కల్పించడం జరుగుతున్నది .

శ్రీ సత్య సాయి జిల్లాలో సుమారు 10490 మంది HIV/AIDS తో వున్నట్లు గుర్తించగా వారిలో 7110 మంది క్రమం తప్పకుండా ART మందులు వాడుతున్నారు . జిల్లా వ్యాప్తంగా 2 ART కేంద్రాలు మరియు 8 లింక్ ART కేంద్రాలు ఉన్నాయి. పలు స్వచ్చంద సంస్దలు, ప్రభుత్వంలో వివిధ శాఖల ద్వారా వివిధ పధకాల ద్వారా HIV / AIDS తో జీవిస్తున్న వారికి సేవలు అందిస్తునాయి అని తెలిపారు .

ఈ కార్యక్రమం లో డిప్యూటీ DMHO డాక్టర్ సునీల్, డా.ప్రభాకర్ రెడ్డి, కమ్యూనిటీయల్స్ ఆఫీసర్లు శివరాం, వన్నప్ప,మడకశిర ఐ సి టి సి కౌన్సిలర్ నరసింహులు,లింకు వర్కర్స్ ప్రోగ్రామ్ రమేష్ యాదవ్ మరియు సిబ్బంది, దిశ లెడ్ పి యూ పెనుకొండ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు మరియు సిబ్బంది,పాజిటివ్ నెట్వర్క్ రామాంజనేయులు ,రాంబాబు,జోనల్ సూపర్వైజర్ వెంకట్, ఎం ఈ ఎ పనిరాజ్, ఎస్ఎంఎస్ ధర్మవరం సిబ్బంది,వి ఎం ఎం, జన జాగృతి కదిరి సిబ్బంది,ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సిబ్బంది ఈ యెక్క ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News