దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం
దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
మహనీయులమాసోత్సవం ఏప్రిల్. మొన్న ఏప్రిల్ 5న బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఉపరాష్ట్రపతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి జరిగింది. 14న డా. బాబాసాహెబ్ భీమరావు అంబేడ్కర్ జయంతి వస్తోంది. అంబేడ్కర్ తన గురువుగా భావించి ‘శూద్రులెవరు?’ పుస్తకాన్ని మహాత్మా జోతిరావు ఫూలే కు అంకితం చేశారు. అంబేడ్కర్ తండ్రి రామ్‌జీ సక్పాల్ బుద్ధుడు, కబీర్, ఫులేలను తన గురువులుగా ప్రకటించారు. ఇలాంటి సామాజిక సంస్కర్త, సాంస్కృతిక విప్లవోద్యమకారుడైన ఫులే 199వ జయంతి ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఇక్కడి నుంచి 2027లో 200వ జయంతి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన సేవలను మరోసారి స్మరిస్తూ, ప్రస్తుత సామాజిక-రాజకీయ సందర్భంలో ఫులే స్ఫూర్తి అవసరాన్ని చర్చిద్దాం.
ఫూలే: బీసీ సంస్కరణల ఆద్యుడు, తెలుగు అండ
ఆధునికభారతదేశంలో బీసీ, దళిత సామాజిక వర్గాల నుంచి సంస్కరణోద్యమాలు నడిపినవారిలో ఆద్యుడు మహాత్మా జోతిరావు ఫూలే (1827-1890). ఆయన పేరులోనే తెలుగువారికి పరిచయం – ‘రావు’ పదం. ఫూలే ఉద్యమానికి మాలి, కుంబీల తర్వాత అత్యధికంగాఅండగా నిలిచినది తెలుగు సముదాయం. రామయ్య వెంకయ్య అయ్యవారు, జాయకరడి లింగూ వంటి తెలుగు నాయకులు సత్యశోధక సమాజ్‌లో కీలక పాత్ర పోషించారు. 1874లో ‘దీనబంధు’ పత్రిక ముద్రణా యంత్రాన్ని సమకూర్చినది తెలుగువారే! తెలుగులో ‘ఫూలే’, ‘జోతిరావు’ అని రాస్తారు. మరాఠీలో ‘ఫులే’, ‘జోతిబా’ ప్రసిద్ధి. ఖండోబా, మాసోబా లాంటి స్థానిక దేవతల్లా ‘జోతిబా’ – మూలవాసుల యోధుడు. మహారాష్ట్ర కొల్హాపూర్ సమీపంలో జోతిబా మందిరం ఇప్పటికీ జాతరలకు ప్రసిద్ధి.తెలంగాణ మల్లన్న తీర్థం లాంటిది.
ఫూలేదృష్టిలో శూద్రులు (బీసీలు), అతిశూద్రులు (దళితులు) ఈ దేశ మూలవాసులు. ఆర్యులు-బ్రాహ్మణులు ఇరాన్ నుంచి వచ్చి బానిసత్వం విధించారు. 1848లోనే శూద్ర-అతిశూద్ర బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేశారు. చదువు ద్వారానే బహుజనుల ఉద్ధారణ అని జీవితాంతం కృషి చేశారు. తాను ఆచరించినట్టు రాశారు, ప్రచారం చేశారు.
స్త్రీ సాధికారత, వితంతు సంస్కరణలు
స్త్రీలసమాన హక్కులు, వితంతు వివాహాలకు వ్యతిరేకంగా నినదించారు. వితంతు స్త్రీలకు శరణాలయం ఏర్పాటు చేశారు. ఒక వితంతు స్త్రీకి పుట్టిన బాలుడిని దత్తతతీసుకొని ‘యశ్వంత్‌రావు’ పేరు పెట్టి పెంచారు. శివాజీ మహారాజ్‌ను శూద్ర యోధుడు, రైతుల రాజుగా కీర్తించి 1869లో ‘శివాజీ పావడా’ (గేయగాథ) రాశారు. 1882లో రాయ్‌గఢ్‌లో శివాజీ సమాధి పట్టింపు లేకుండా వెతికి పునర్నిర్మించారు. ప్రతి ఏటా ఉత్సవాలు, నిధుల కోసం పోరాడారు.
అయితే, ఫులే బతికున్నప్పుడు బ్రాహ్మణులు శివాజీని పట్టించుకోలేదు. 1895 నుంచి తిలక్ ‘కేసరి’ పత్రిక ద్వారా ‘శివాజీ ఉత్సవాలు’ ప్రారంభించి, 15,000 రూపాయలవిరాళాలు సేకరించారు. శివాజీని ‘గో-బ్రాహ్మణ ప్రతిపాలకుడు’గా ముద్రించారు. ఫూలే శిష్యుడు దోండిరామ్ కుంభార్ 1895లోనే దీన్ని వ్యతిరేకించి, శివాజీ శూద్రులకు మాత్రమే చెందినవాడని కవిత్వం రాశారు.
ప్రస్తుత ఘర్షణలు: శివాజీ- ఫూలే విభజన
ఇప్పుడురైట్‌వింగ్ నాయకులు శివాజీని ‘హిందూ రాజు’గా ప్రచారం చేస్తున్నారు.తెల్లాపూర్, మెదక్, కరీంనగర్‌లో ఫులే విగ్రహాలకు పోటీగా శివాజీలు ప్రతిష్ఠిస్తూ ఘర్షణలు. రాజకీయ లాభం కోసం బహుజనులను విభజించే ప్రయత్నం.నిజానికి శివాజీ లౌకికవాది, సైన్యంలో ముస్లింలకు అత్యున్నత పదవులు ఇచ్చాడు. ఫులే ఆయనను కీర్తించి పావడా రాస్తే, హిందూ మతవాది అని చెప్పడం తప్పు.
శూద్రాతిశూద్రులు (ఎస్సీ-బీసీలు) ఐక్యంగా నిలబడాలి. ఫులే విద్యలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ‘విద్యాశాఖలో బ్రాహ్మణ పంతుళ్లు’ గేయకావ్యం రాశారు. ‘హంటర్ కమిషన్’కు నివేదిక ఇచ్చారు – బ్రాహ్మణ టీచర్లు శూద్రులపై వివక్షచూపిస్తారు, చిత్రహింసలు చేస్తారని. ఇప్పటికీ రోహిత్ వేములా యూనివర్సిటీల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. న్యాయం, ఎగ్జిక్యూటివ్, మీడియాలో బ్రాహ్మణాధిపత్యం. దీన్ని ఎదుర్కొని సమానత్వం సాధించాలి.
2026 కార్యక్రమాలు: బహుజన ఐక్య సమరం
ఫులేఅభిమానులు 1990ల నుంచి ఏడాది పొడుగునా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఫూలే అంబేడ్కర్ ఆలోచన సమితి’ నిజామాబాద్‌లో ఏప్రిల్ 11న బహుజన సంకలనం. కటకం నర్సింగరావు ‘మన ఆలోచన సాధన సమితి’ ఏప్రిల్ 19న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీసీ జాగరణ జాతర. నాగర్‌కర్నూల్ ‘ఫూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక’, వనపట్ల ‘బీసీ సాహిత్య వేదిక’ రచనల ప్రచురణకు సిద్ధం. పెబ్బేటిమల్లికార్జున్ ‘బీసీ భేరి’, సిద్దిపేట కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్ గ్రంథాలయం ఏర్పాటు. అన్ని విశ్వవిద్యాలయాలు ఘనోత్సవాలు.
ప్రభుత్వ బాధ్యతలు: భారతరత్న, సామాజిక సాధికారత
2027 శతజయంతికి ‘భారతరత్న’ కోసం కేంద్రంపై వత్తిడి తీసుకోవాలి. తెలంగాణ ప్రగతి భవన్‌కు ‘ఫూలే’ పేరు, రచనల తెలుగు అనువాదం, పాఠ్యపుస్తకాల్లో ఫులే పాఠాలు (5వ తరగతి నుంచి PG) – బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత. కామారెడ్డి డిక్లరేషన్‌లో ‘ఫూలే బీసీ సబ్ ప్లాన్’ ప్రకటన ప్రకారం చర్యలు.
ఏప్రిల్ 11ను ‘సామాజిక సాధికారత దినోత్సవం’గా ప్రకటించి, సోషల్ ఆడిట్ చేయాలి. బీసీ నిధుల శ్వేత పత్రాలు, కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. జనాభా మేరకు కాంట్రాక్టులు, పదవుల్లో వాటా – ఫూలే స్ఫూర్తితో బహుజనులు కొట్టుకోవాలి. ఇది మన గవర్నెన్స్‌లో పారదర్శకత, జవాబుదారీతనానికి మార్గం. ఫూలేదార్శనికత సమాజాన్ని చైతన్యపరుస్తుంది. బీసీ, దళితులు ఐక్యంగా నిలబడి అధికార విభజన సాధించాలి. ఆయన జయంతి మనకు పోరాట స్ఫూర్తిని రగిలిస్తుంది!

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి